Cinenagar.com, Telugu cinema news, Tamil, Malayalam,Hindi,Dubbing English,Tollywood,Technologies, Bollywood,Songs, Downloads
Welcome
Login

#IVNR Trailer | Sushanth A, Meenakshii Chaudhary | S Darshan | Praveen Lakkaraju

Your video will begin in 10
You can skip to video in 5

Thanks! Share it with your friends!

URL

You disliked this video. Thanks for the feedback!

Sorry, only registred users can create playlists.
URL


Added by sam in TELUGU
771 Views

Description

Presenting Ichata Vahanumulu Niluparadu ( IVNR ) Official Trailer

#Sushanth #MeenakshiChaudhary #SDarshan #IVNRTRAILER

Production House: AI Studios & Shaastra Movies Movie Name: Ichata Vahanumulu Niluparadu Producers: Ravi Shankar Shastri, Ekta Shastri & Harish Koyalagundla
Director: S Darshan
Starring Cast: Sushanth, Meenakshii Chaudhary, Vennela Kishore, Priyadarshi & Others Music Director: Praveen Lakkaraju
DOP: M Sukumar
Editor: Garry BH
Art: VV
Choreography: Brinda, Raj Krishna
Fights: Real Satish
Dialogues: Suresh Baba, Bhaskar R
PRO: Vamsi Shekar
------------------------------------------------------------------------------------------
క‌థేంటంటే: అరుణ్ (సుశాంత్) ఓ మ‌ధ్యత‌ర‌గ‌తి కుర్రాడు. డిజైన్ స్టూడియో అనే కంపెనీలో ఆర్కిటెక్ట్‌గా ప‌ని చేస్తుంటాడు. అదే కంపెనీలో ఆర్కిటెక్ట్ ఇంట‌ర్న్ కోసం జాయిన్ అవుతుంది మీనాక్షి (మీనాక్షి చౌద‌రి). ఇద్దరూ తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డిపోతారు. మీనాక్షి అన్న న‌ర్సింగ్‌ యాద‌వ్ (వెంక‌ట్‌) స్నేహ‌పురి ఏరియాకి ఓ నాయ‌కుడిలా వ్యవ‌హ‌రిస్తుంటాడు. త‌న ఏరియాలో జ‌రిగే వ‌రుస దొంగ‌త‌నాలు, దోపిడీల‌ను అడ్డుకునేందుకు త‌న మ‌నుషుల‌తో నిత్యం గ‌స్తీ కాయిస్తుంటాడు. ఓరోజు న‌ర్సింగ్‌ ఊరెళ్లడంతో.. మీనాక్షిని క‌లిసేందుకు అరుణ్ త‌న కొత్త బైక్‌పై స్నేహ‌పురి ఏరియాకు వెళ్తాడు. నో పార్కింగ్ అని బోర్డున్న ఓ ఇంటిముందు త‌న బైక్ పార్క్ చేసి ఆమెను క‌లిసేందుకు వెళ్తాడు. అదే స‌మ‌యంలో అక్కడ ఓ సీరియ‌ల్ న‌టి హ‌త్య జ‌రుగుతుంది. అది అనుకోకుండా అరుణ్ మెడ‌కు చుట్టుకుంటుంది. అరుణ్‌కు సాయం చేసేందుకు వ‌చ్చిన పులి (ప్రియ‌ద‌ర్శి) కూడా క‌నిపించ‌కుండా పోతాడు. మ‌రి ఆ హ‌త్యకు కార‌కులు ఎవ‌రు? అరుణ్ ఆ కేసు నుంచి, ఆ స్నేహ‌పురి ఏరియా నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డ్డాడు? క‌నిపించ‌కుండా పోయిన పులికి ఏమైంది? ఈ మొత్తం వ్యవహారంలో న‌ర్సింగ్‌, భూష‌ణ్ (ర‌వివ‌ర్మ‌), సీఐ రుద్ర (కృష్ణ చైత‌న్య‌)ల‌కు ఉన్న లింకేంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: ఇదొక విభిన్నమైన యాక్షన్ థ్రిల్లర్‌.  కామెడీ.. రొమాన్స్‌.. యాక్షన్‌.. థ్రిల్లింగ్‌.. ఇలా అన్ని అంశాల‌ను స‌మ‌పాళ్లలో మేళ‌విస్తూ ద‌ర్శకుడు ఎంతో చ‌క్కగా క‌థ రాసుకున్నారు. నిర్లక్ష్యంగా చేసిన కొన్ని ప‌నుల వ‌ల్ల క‌థానాయ‌కుడు ఎలాంటి చిక్కుల్లో ఇరుక్కున్నాడు.. త‌న వాళ్లని ఎలా ఇబ్బందుల్లో పెట్టుకున్నాడు.. వాటి నుంచి ఎలా బ‌య‌ట‌పడ్డాడన్నది క్లుప్తంగా చిత్ర  ఇతివృత్తం. ఓ లైన్‌గా చెప్పుకున్నప్పుడు ఇది చిన్న పాయింట్‌లా క‌నిపించినా.. దీంట్లో అంతర్లీనంగా మ‌రికొన్ని ఉప‌క‌థ‌లు క‌నిపిస్తుంటాయి. స్నేహ‌పురి కాల‌నీలో న‌ర్సింగ్‌.. భూష‌ణ్‌ల పొలిటిక‌ల్ వార్‌, రాజ‌కీయంగా.. వ్యక్తిగ‌తంగా న‌ర్సింగ్‌ను దెబ్బ తీయ‌డానికి భూష‌ణ్‌తో క‌లిసి సీఐ రుద్ర వేసే ప‌న్నాగాలు.. ఈ పోరులో అనుకోకుండా స‌మ‌స్యల్లో చిక్కుకున్న అరుణ్ జీవితం.. అతని ప్రేమ‌క‌థ వంటివి క‌నిపిస్తాయి. వీట‌న్నింటిని ఒక‌దానితో ఒక‌టి ద‌ర్శకుడు ముడిపెట్టిన విధానం ఆక‌ట్టుకుంటుంది. ఆరంభంలో తొలి ఇర‌వై నిమిషాలు అరుణ్‌, మీనాక్షిల పరిచ‌యం.. వారిద్దరూ ప్రేమ‌లో ప‌డ‌టం.. ఇద్దరి మ‌ధ్య వ‌చ్చే రొమాంటిక్ స‌న్నివేశాల‌తోనే న‌డిచిపోతుంది. ఆయా స‌న్నివేశాలు అక్కడక్కడామెప్పించినా.. క‌థ‌లో ఎలాంటి ముంద‌డుగు ప‌డిన‌ట్లు అనిపించ‌దు.

అరుణ్ కొత్త బైక్ కొనుక్కుని మీనాక్షి ఇంటికి వెళ్లడం.. ప‌ది గంట‌ల త‌ర్వాత అత‌ను ర‌క్తమోడుతూ తిరిగి రావ‌డం.. మ‌రోవైపు అత‌ని త‌ల్లి ప్రమాదానికి గుర‌వ‌డం.. స్నేహితుడు పులిని పోలీసులు అరెస్ట్ చేయ‌డంతో మ‌ధ్యలో ఏం జ‌రిగిందన్న ఆస‌క్తి ప్రేక్షకుల్లో క‌లుగుతుంది. అక్కడి నుంచి నేరుగా క‌థ‌లోకి వెళ్లిపోయిన‌ దర్శకుడు.. ఎక్కడా ప్రేక్షకుడి దృష్టి మ‌రల్చకుండా క‌థ‌నాన్ని ముందుకు తీసుకెళ్లాడు. ముఖ్యంగా మీనాక్షి ఇంట్లో నుంచి అరుణ్ బ‌య‌ట ప‌డేందుకు చేసే ప్రయ‌త్నాలు.. అత‌ని బైక్‌ను బ‌య‌ట‌కు తీసుకెళ్లేందుకు సుక్కు (వెన్నెల కిషోర్‌), మేట‌ర్ (హ‌రీష్‌)లు చేసే ప్రయ‌త్నాలు థ్రిల్ పంచుతూనే..  న‌వ్వులు పూయిస్తుంటాయి. అయితే కొన్ని స‌న్నివేశాల్లో నాట‌కీయ‌త మ‌రీ ఎక్కువైన‌ట్లు అనిపిస్తుంది.  ద్వితీయార్ధంలో అరుణ్ హ‌త్య కేసు నుంచి బయట పడేసేందుకు చేసే ప్రయత్నాలు.. ఈ క్రమంలో స్నేహ‌పురి కాల‌నీ  కుర్రాళ్లతో చేసే పోరాటాలు..తదితర సన్నివేశాలతో కథనం ప‌రుగులు పెడుతుంటుంది. క్లైమాక్స్‌లో హ‌త్య కేసు కార‌కుల్ని హీరో త‌న తెలివితేట‌ల‌తో బ‌య‌ట‌పెట్టే సన్నివేశాలు కాస్త సినిమాటిక్‌గా అనిపించినా.. ముగింపు ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది. 

 

Post your comment

Sign in or sign up to post comments.

Comments

Be the first to comment
RSS